ఈ లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలు..
అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు!
ఈ లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. అవి ఏంటంటే..
ఈ మధ్య కాలంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇది లక్షలాది మంది మరణానికి కారణమవుతోంది.
వైద్య నిపుణుల ప్రకారం.. క్యాన్సర్ రావడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి.
కొందరికి నోటి లోపల గాయాలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా కనిపించొచ్చు. కానీ ఎక్కువ రోజులు నయం కాకపోతే ఇది నోటి క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలి.
కొంచెం ఆహారం తీసుకున్నా సరే వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు కారణమని చెబుతున్నారు.
5 లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు.
క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి అలసట. ఇది విపరీతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు.
మలంలో రక్తం పడితే, అది పెద్ద పేగు క్యాన్సర్‌కు లేదా మల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.
Related Web Stories
గర్భిణులు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?
ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి..
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా?
మందులతో షుగర్ కంట్రోల్ కాకపోతే ఈ ఆకును ట్రై చేయండి!