టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, మన శరీరానికి అది సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.

మీ ఫోన్‌ను ఎప్పుడూ ప్యాంట్ జేబులో ఉంచుకుంటున్నారా? గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని పని చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుందని కలకత్తా యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.

ఈ అలవాట్లు పురుషులలో వీర్యకణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, నపుంసకత్వానికి  దారితీస్తాయని తాజా భారతీయ పరిశోధన హెచ్చరిస్తోంది.

రోజుకు 5 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకునే వారిలో వీర్యకణాల నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించారు.

 ల్యాప్‌టాప్‌ను నేరుగా ఒడిలో పెట్టుకుని ఎక్కువ సేపు పనిచేయడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరిగి, వీర్యకణాల ఉత్పత్తి మందగిస్తుందని తేలింది.

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ నేరుగా మీ ఒడిలో ఉంచుకోకండి. ఎల్లప్పుడూ టేబుల్ లేదా ల్యాప్‌టాప్ స్టాండ్‌ని ఉపయోగించండి.

ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు మన జీవితంలో ఒక భాగం. కానీ వాటిని సరైన మార్గంలో ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, సంతానోత్పత్తికి ముప్పును చాలా వరకు నివారించవచ్చు.