చక్కెర ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా? నిజం ఏంటంటే…
ఆరోగ్యంగా ఉండాలంటే దేనినైనా మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని చెబుతుంటారు.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అలాగే షుగర్ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని వైద్యులు చెబుతుంటారు.
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. దీని వల్ల శరీరం అనేక వ్యాధులకు కారణమవుతుంది.
నిజానికి చక్కెర అనేది ఒక రకమైన ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది కాలక్రమేణ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబతున్నారు.
అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చక్కెరలో రసాయనాలు, హానికరమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతాయి.
షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.