షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్‌లో ఉంటది..

షుగర్ పేషెంట్లు కొన్ని రకాల ఫుడ్స్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అవేంటో చూడండి.

కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు

గుడ్లు, పనీర్, చికెన్, శనగలు లాంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలు అరిగే ప్రక్రియను సమతుల్యం చేస్తాయి.

ఇవి గ్లూకోజ్‌‌ను నెమ్మదిగా రక్తంలోకి పంపుతాయి. దాంతో తిన్న వెంటనే షుగర్ పెరగదు.

ఫైబర్ ఉన్న ఆహారాలు  తినడం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా.. స్థిరంగా ఉంటాయి.

 బీన్స్, మినుములు, శనగలు వంటి పప్పు ధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి షుగర్ లెవెల్స్ స్టేబుల్‌గా ఉంచుతాయి.

 కొన్ని అధ్యయనాల ప్రకారం, దాల్చిన చెక్క ఇన్సులిన్ బాగా చేసేలా చేయగలదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసుకోవాలంటే రోజువారీ తినే అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే చాలు.