పైల్స్‌తో బాధపడుతున్నవారు  వీటిని అస్సలు తినకండి.. 

 పైల్స్ లేదా మూలవ్యాధి చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. 

ఈ వ్యాధితో బాధపడేవారికి మలద్వారం చుట్టూ వాపు, నొప్పి ఎక్కువగా ఉంటుంది.

పైల్స్ వచ్చినప్పుడు మలవిసర్జన సమయంలో నొప్పి, దురద, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  

ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఎందుకంటే, కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచుతాయి. పైల్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

పైల్స్ ఉన్న వారు స్పైసీ ఫుడ్ నివారించాలి. ఎందుకంటే ఇవి పైల్స్‌ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

జంక్ ఫుడ్ పిజ్జా, బర్గర్లు, చిప్స్, శుద్ధి చేసిన పిండి వంటి తక్కువ ఫైబర్ ఆహారాలు మలబద్ధకానికి కారణమవుతాయి.

పైల్స్ రోగులు ఎక్కువ ఉప్పు తినకూడదు. ఎందుకంటే ఉప్పు నీటిని పీల్చుకుని మలం గట్టిపడేలా చేస్తుంది.

తగినంత నీరు, ఇతర ద్రవాలు తాగడం వల్ల మలబద్ధకం నివారించవచ్చు.