పులస చేపలో ఇన్ని పోషకాలా.. 

పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలంటారు. ఈ చేపకు గిరాకీనే కాదు.. దీని ఖరీదు సైతం ఎక్కువే.

ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే లభ్యమవుతుంది.

వీటిలో విటమిన్లు డి, బి 12, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటిన్లు, పాస్పరస్, సెలీనియం, కాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు, పైబర్ తదితర పోషకాలుంటాయి. 

వీటిలో విటమిన్లు డి, బి 12, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటిన్లు, పాస్పరస్, సెలీనియం, కాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు, పైబర్ తదితర పోషకాలుంటాయి. 

పులస చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

పులసలో మంచి కొవ్వు పదార్థాలుంటాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణ చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా మతిమరుపును తగ్గిస్తుంది. 

వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.

వీటిలో ప్రోటీన్లు కారణంగా.. సులభంగా బరువు తగ్గుతారు. 

వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

పులస చేప తినడం వల్ల ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు.. ఈ చేప ఎముకల ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తోంది.