కొన్ని అందమైన పూలను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మందార పూలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటూ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పేదల కుంకుమ పువ్వు అని పిలిచే కలేన్ద్యులా పూలను టీ, సిరప్, సలాడ్లు, స్వీట్లపై అలంకరణకు ఉపయోగిస్తుంటారు.

క్రిసాన్తిమం పూలను తినడం వల్ల నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

లావెండర్ పూలు ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

సోంపు మొక్కకు పూచే పసుపు పూలు జీర్ణక్రియకు పని చేస్తాయి. అలాగే చర్మాన్ని ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి. 

చమోమిలే పూలు, మొగ్గలు, ఆకులు తినవచ్చు. వీటిని వివిధ వంటలతో పాటూ టీలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇందులోని పోషకాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.

నాస్టూర్టియం పూలలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

గులాబీ రేకుల్లోని విటమిన్-'సి, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.