భుజాలు, చేయి, వీపు, మెడ, దవడ లేదా పొట్టలోకి వ్యాపించే నొప్పిని అనుభవించవచ్చు.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం త్వరగా శ్వాస తీసుకోవడం గుండెపోటు కు ఒక సూచన.

సాధారణంగా చెమటలు పట్టడం కూడా గుండెపోటు లక్షణమే కావచ్చు.

వికారం మరియు తల తిరగడం వంటివి గుండెపోటు యొక్క లక్షణాలుగా ఉండవచ్చు.

ఎడమ లేదా కుడి చేతిలో నొప్పి రావడం కూడా గుండెపోటుకు ఒక సూచన,

గుండెపోటును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.