బరువు తగ్గాలనుకునే వారికి  బఠానీలు బెస్ట్‌ చాయిస్‌..

 పచ్చి బఠానీలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలుంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.

బరువు తగ్గడానికి చూస్తున్నవారికి బఠానీలు మంచి ఎంపిక, ఎందుకంటే వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

పచ్చి బఠానీలలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

బఠానీలలోని పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.