ఫిట్స్ వచ్చినప్పుడు  చేతిలో తాళం చెవి పెడితే  తగ్గుతుందా..

ఫిట్స్.. దీన్నే మనం మూర్ఛ రోగం అని కూడా పిలుస్తాం.

రక్తంలో సోడియం లేదా గ్లూకోజ్ వంటి పదార్థాల స్థాయిలు అసాధారణంగా మారినప్పుడు కూడా ఫిట్స్ సంభవించవచ్చు.

అయితే.. మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళం చేతులు పెట్టడం గురించి మీరు వినే ఉంటారు.

ఇది నిజం కాదు.. ఫిట్స్‌కి, ఇనుప తాళం చెవికి ఎలాంటి సంబంధం లేదు.

అసలు ఫిట్స్ వచ్చేటప్పుడు వ్యక్తుల చేతిని తెరవడం, అందులో ఏదైనా పెట్టి మూయడం వంటివి చెయ్యకూడదు.

ఇలాంటివి చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, కొన్నిసార్లు ప్రమాదాన్ని పెంచవచ్చునని చెబుతున్నారు.

ఫిట్స్ తగ్గించడానికి ఫిట్స్ వ్యక్తిని చదునైన ఉపరితలంపై పడుకోబెట్టి, చుట్టుపక్కల ఉన్న ప్రమాదకర వస్తువులను తొలగించాలి.

 వ్యక్తిని ఒక పక్కకు తిప్పాలి, నోటిలో ఏదైనా ఉంటే జాగ్రత్తగా తీసివేయాలి.

ఫిట్స్ తగ్గిన తర్వాత వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.