పరీక్షల సమయంలో పిల్లలకు  ఇలాంటి ఫుడ్స్ పెడితే మంచిది..

పరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు పిల్లలు సాధారణంగా చదువుల్లో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

దీనివల్ల ఎదుగుదల సరిగా లేకపోవడమే కాక, బరువు పెరగడం, తగ్గడం, నీరసం లాంటి పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. 

రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు ఇచ్చినట్లయితే వారి ప్రొటీన్‌ అవసరాలకు సరిపోతుంది. 

మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప, మటన్‌ నూనె తక్కువ వేసి వండి పెట్టవచ్చు. 

కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.

కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే పెట్టడం కాకుండా వాటితో పాటు కూర, పప్పు అధికంగా తినడానికి ప్రోత్సహించాలి.

సరైన ఆహారంతో పాటు సరైన శారీరక శ్రమ, వ్యాయామం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

రాత్రి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి.