మట్టి పాత్రల్లో వంటకాలు  చేసుకుంటే కలిగే ఫలితాలు ఇవే..

మట్టి పాత్రల్లో వంట చేసేప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వలన ఆహారంలోని పోషకాలు కొంత తక్కువ నశిస్తాయి.

పాత్రల తయారీకి వాడిన మట్టి వలన ఈ వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది.

ఆ మట్టిలో ఉండే కొన్ని లవణాలు, ఖనిజాలు కూడా ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుంది.

కానీ కొన్ని రకాల పాలిషింగ్‌, కోటింగ్‌ వేసిన మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల మెర్క్యూరీ, లెడ్‌ వంటి ప్రమాదకరమైన పదార్థాలు ఆహారంలో చేరే అవకాశం ఉంటుంది.

మట్టి పాత్రల్లో ఆహారం వండేముందు వాటిని జాగ్రత్తగా శుభ్రపరచడం కూడా ముఖ్యం.

సరైన మట్టి పాత్రల్లో వండిన తాజా ఆహారం తినడం వల్ల ఏరకమైన ఇబ్బందులు రావు.