కొందరికి ఎండాకాలం వేడి వల్ల  కూడా కాళ్లు పగిలి  తీవ్ర మంటను కలిగిస్తాయి.

తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పగుళ్లు తగ్గకపోగా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంటాయి. 

కాళ్ళు పగుళ్ళు కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తూ పగుళ్లు సమస్య తగ్గి మంచి ఉపశమనం పొందవచ్చును.

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండి పాదాలను బెట్టాలి. పగుళ్లు తగ్గడంతో పాటు మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండు గుజ్జును తీసుకోని పాదాలుకుఈ మిశ్రమాన్ని పగుళ్ల ఏర్పడిన చోట రాసి కొద్దిసేపటికి కడిగేస్తే మంట తగ్గుతుంది.

రాత్రి పడుకునే ముందు పగిలిన కాళ్లకు కొబ్బరి నూనె, లేదా నువ్వుల నూనె రాసుకుని మర్దన చేయాలి

ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో పాటు తగ్గుముఖం పడతాయి.

కలబంద గుజ్జు తినడం వల్ల ప్రయోజనాలు కలగుతాయని అనుకుంటారు. కానీ ఇది కాళ్ళ పగుళ్లను కూడా తగ్గిస్తుంది.

వారానికి ఐదు రోజులు ఈ గుజ్జును కాళ్ళకు రాసుకోవాలి. రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.