చిన్నపాటి ఫైబ్రాయిడ్
గడ్డలతో గర్భం దాల్చే
అవకాశాలకు ఎలాంటి
అవరోధం ఉండదు.
సాధారణంగా ఫైబ్రాయిడ్ గడ్డలు చిన్నవిగా ఉంటాయి. పైగా వాటి వల్ల గర్భసంచి పరిమాణం తగ్గడం, ఫెలోపియన్ ట్యూబులకు అడ్డంకులు ఏర్పడడం ఎంతో అరుదు.
ఇవే గడ్డలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నా, లోపలి వైపుకు పెరుగుతున్నా, గర్భధారణలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
కొన్నిసార్లు గడ్డలు గర్భసంచి పైవైపు ఒక మూలలో పెరగవచ్చు. వాటి వల్ల ఫెలోపియన్ ట్యూబులో అవరోధాలు ఏర్పడి గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి
కొన్ని సందర్భాల్లో పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల, గర్భస్రావం జరగడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం లాంటివి కూడా జరుగుతుంది
ఫైబ్రాయిడ్స్‌తో గర్భం దాల్చినప్పుడు గడ్డలకు రక్తప్రసరణ పెరిగి వాటి పరిమాణం కూడా పెరిగి బాధ, అసౌకర్యం వేధించవచ్చు.
అలాంటి సందర్భాల్లో ఆస్పత్రిలో చేరి నొప్పినివారణ చికిత్స తీసుకోవలసి వస్తుంది.
ఫైబ్రాయిడ్స్ గర్భసంచి కింది భాగంలో పెరిగితే, గర్భాశయంలో బిడ్డ అడ్డంగా లేదా తలకిందులుగా పెరిగి, సిజేరియన్ సర్జరీ చేయవలసి వస్తుంది.
నొప్పి వేధిస్తున్నా, సర్జరీతో ఫైబ్రాయిడ్స్‌ను తొలగించుకోవాలి. సర్జరీ జరిగిన ఆరు నెలల తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చేయాలి
Related Web Stories
వాము గింజల నీటిని తాగితే కలిగే లాభాలు ఇవే
ఈ చిట్కాలతో కంటి చూపు మెరుగుపడుతుంది తెలుసా..
కాళ్ళు పగుళ్ళు వేధిస్తున్నాయా ఈ చిట్కా ఫాలో అవ్వండి
నల్ల పసుపు గురించి దిమ్మతిరిగే నిజాలు