మందులు లేకుండా హై బీపీని నియంత్రించే చిట్కాలు ఇవిగో..
బీపీ గాని షుగర్ కానీ వస్తే.. దీని ప్రభావం శరీరంలోని మిగత అవయవాలపై పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
హైపర్ టెన్షన్‌ను మందులు లేకుండా రోజువారి జీవన విధానం ద్వారా నివారించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా బీపీ నుంచి బయటపడొచ్చు.
మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి తీసుకోవాలి. స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారం, సంతృప్త కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
హైపర్ టెన్షన్ నివారించేందుకు DASH (డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్) చాలా సహాయకారిగా ఉంటుందని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. టీ స్పూన్ కంటే తక్కువగా తీసుకోవాలి. ఆహారంలో సోడియాన్ని తగ్గించడం ద్వారా.. బీపీ పెరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వారంలో రెండు సార్లు కండరాలను పెంచే వ్యాయామం చేయాలి.
సిగరెట్ తాగడం.. రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. దీంతో రక్తపోటు, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనిని సైతం మానేయాలి.
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం యోగా, ధ్యానం, లోతైన శ్వాస వంటి విశ్రాంతి వ్యాయామాలు చేయాలి.
కంటి నిండ నిద్ర ఉండాలి. అంటే.. ప్రతి రోజు 7 నుంచి 9 గంటల నిద్రపోవాల్సి ఉంటుంది. నిద్ర లేకుంటే రక్తపోటు పెరుగుతుంది.
క్రమం తప్పకుండా బీపీ తనిఖీ చేయడం వల్ల కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
షుగర్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు.. బీపీకి కారణమవుతాయి. ఈ సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాల్సి ఉంటుంది.