నోటి పూత వేధిస్తోందా..  అయితే ఇలా చేయండి..

నోటి పూత సమస్య అన్ని వయసుల వారిలో తరచుగా చూస్తూనే ఉంటాం. 

తినడంలో అజాగ్రత్త కారణంగానే ఈ  సమస్య వస్తుంది. 

నోటి పూత తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆహారం తినడం కష్టంగా మారుతుంది. 

ఆయుర్వేదం ప్రకారం, జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు కడుపులో వేడి ఉంటుంది. దీని కారణంగా నోటి పూతలు వస్తాయి.

నోటి పూత వచ్చినప్పుడు  పటిక నీటితో పుక్కిలించాలి. ఇది పూతల నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది.

దీనితోపాటు పెరుగు, తేనె, పసుపు, త్రిఫల, తులసి ఆకులు, ఏలకులు, సోంపు, చక్కెర సిరప్, కొత్తిమీర, లికోరైస్ కూడా ఉపయోగించవచ్చు.

ఇవి నోటి పూత నుంచి త్వరగా ఉపశమనం ఇస్తాయి.