ఆముదం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..

ఆముదం.. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. పేగు సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

చర్మ సంరక్షణకు ఇది అద్భుతమైనది. చర్మాన్ని తేమతో నింపి, పొడిగా మారకుండా కాపాడుతుంది. ఇది చర్మంలోని మొటిమలు, చర్మవ్యాధులు, మచ్చలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది.

దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. చర్మంపై అనేక ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

జుట్టు కుదుళ్ళకు దీనిని రాసి మసాజ్ చేస్తే, తలలో రక్తప్రసరణ మెరుగుపడి, జుట్టు త్వరగా ఎదుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారు ఆముదం ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వలన కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని నేరుగా కీళ్లపై రాసి మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆముదాన్ని గర్భాశయ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. దీనిని కడుపుపై మసాజ్ చేయడం ద్వారా క్రమబద్ధమైన రుతుస్రావం జరగడంలో సహాయ పడుతుంది.

పాదాల పగుళ్ళను తగ్గిస్తుంది.  

ఆముదం.. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆముదాన్ని శరీరంపై రాసి మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ క్రమబద్ధంగా జరుగుతుంది. దీని వలన శరీరం యౌవనంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.