ఉదయం ఏ సమయంలో  హార్ట్‌ఎటాక్ ఎక్కువగా వస్తుందో  తెలుసా?

చిన్నా, పెద్దా తేడా లేకుండా హార్ట్‌ఎటాక్‌ బారిన పడుతున్నారు

గుండెపోటు, స్ట్రోక్ వస్తే సరైన సమయంలో చికిత్స అవసరం.. లేదంటే ప్రాణాలు కోల్పోతారు

గుండెపోటు రోజులో ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి

తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో హార్ట్‌ఎటాక్ వస్తుంటుంది

హార్మోన్ల పెరుగుదల ఇందుకు కారణం

ఉదయం లేచే సమయంలో కార్టిసాల్, కాటెకోలమైన్‌లు వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి

హార్మోన్ల పెరుగుదల రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. 

రక్తం గడ్డకట్టడం కూడా ఉదయం హార్ట్‌ స్ట్రోక్‌కు మరో కారణం

రాత్రి సమయంలో నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల రక్తం డిహైడ్రేషన్‌కు గురై చిక్కగా మారుతుంది

ఉదయం గుండెపోటు, స్ట్రోక్ వస్తే వెంటనే వైద్య సహాయం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చు