చాలా మందికి తరచుగా ఉదయం మేల్కున్న తర్వాత తలంతా భారంగా ఉండటంతో పాటు తేలికపాటి లేదా తీవ్రమైన నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది.
ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పిగా అనిపిస్తే, దానికి అత్యంత సాధారణ కారణం నిద్ర లేకపోవడం అని డాక్టర్లు అంటున్నారు.
శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ వల్ల ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పి వస్తుంది.
ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుంది.
డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా అనిపించవచ్చు.
ఇంకా, పళ్లు నూరడం (బ్రక్సిజం) అంటే దంతాలు బిగించడం వల్ల దవడ కండరాలు ఒత్తిడికి గురై తలనొప్పి వస్తుంది.
కెఫీన్ అలవాటు ఉన్నవారు దాన్ని తీసుకోవడం తగ్గించినా, సైనస్, కొన్ని ఇతర వ్యాధుల వల్ల కూడా ఇలా జరుగుతుంది.
కొన్నిసార్లు శరీరంలోని ఏదైనా తీవ్రమైన వ్యాధులు ఉన్నాఇలా జరగవచ్చు. పదే పదే మార్నింగ్ తలనొప్పి వస్తుంటే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేసుకుని చికిత్స తీసుకోవాలి.