తేనెలో దగ్గు, గొంతు నొప్పిని  శాంతపరిచే గుణాలు ఉన్నాయి.

ఒక టీ స్పూన్ తేనెను వేడి నీటితో లేదా హెర్బల్ టీతో కలిసి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

గోరు వెచ్చని ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా గుంతులో చికాకు, గరగర తగ్గుతుంది.

రోజులై వీలైనన్ని సార్లు ఇలా చేయడం దగ్గును కూడా తగ్గిస్తుంది.  

ఆవిరి పీల్చడం ద్వారా గొంతులోని కఫం కరిగిపోతుంది.

రోజులోని కొన్ని నిమిషాల పాటు పసుపు, ఉప్పు వేసిన నీటి ఆవిరిని పీల్చితే దగ్గు తగ్గుతుంది.  

అల్లం, పుదీనా, చామంతి టీ వంటి హెర్బల్ టీలు తాగితే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

రాత్రి నిద్రపోయేటపుడు తలను ఎత్తులో ఉంచాలి. అలా చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.