ఫిష్ ఆయిల్ తీసుకుంటే ఇన్ని లాభాలా..? వీటిలోని ఉండే పోషకాల సంగతి తెలిస్తే..!

షిష్ ఆయిల్‌లో అనేక పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయని వివరిస్తున్నారు.

ఈ ఆయిల్‌లో హార్ట్, బ్రెయిన్ హెల్త్‌కు సంబంధించిన అనేక లాభాలున్నాయి. ఫిష్‌ ఆయిల్‌ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది.

అనేక చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. ఒక గ్రామ్ ఫిష్‌ ఆయిల్‌లో సుమారు 300 నుంచి 500 మిల్లీగ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

ఈ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఫిష్ ఆయిల్‌.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చేపనూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఐకోసాపెంటోనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం. ఇది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో మెడిసిన్‌లా పనిచేస్తుంది.

ఫిష్ ఆయిల్ క్యాప్సుల్‌లో 400 నుంచి 1000 ఐయూ పరిమాణంలో విటమిన్ డి లభిస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో ఇది సహాయపడుతుంది.

విటమిన్ డి కాల్షియం శోషణను కూడా మెరుగుపరుస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

ఫిష్‌ ఆయిల్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ ఆయిల్‌ తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దరి చేరవు.

ఫిష్‌ ఆయిల్‌లో సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. వ్యాధి నిరోధకశక్తిని బలంగా మార్చుతుంది.

ఫిష్‌ ఆయిల్‌లో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.