ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. 

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అసిడిటీ పెరుగుతుంది.

శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. తద్వారా ఒత్తిడి, మానసిక సమస్యలు తలెత్తుతాయి.

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల చురుకుదనం పోయి వింత భయం కలుగుతుంది.

అల్సర్లు వంటి జీర్ణ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలి. 

ఖాళీ కడుపుతో ఈ కాఫీ తాగడం వల్ల కడుపులో పూత, పేగు రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

అల్పాహారం తర్వాత ఎలాంటి టీ, కాఫీ తాగినా ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.