నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొన్ని ఆహారాలు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు.

పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిమ్మరసం లేదా పెరుగు అలెర్జీ ఉన్నవారు వీటిని కలిపి తినకూడదు.

ఆయుర్వేదం ప్రకారం… నిమ్మరసం వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. పెరుగు చలువ చేసే గుణం కలిగి ఉంటుంది.

ఈ రెండు వ్యతిరేక గుణాలు. ఈ ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.

 పేగుల వాపు, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు పెరుగు, నిమ్మరసాన్ని కలిపి అస్సలు తీసుకోకూడదు.