రక్తహీనత ఉన్నవారు ఐరన్ పెరిగేందుకు తినాల్సిన 5 ఆహారాలు..

పాలకూరలో నాన్-హీమ్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సలాడ్లు, స్మూతీలు లేదా వెల్లుల్లి, విటమిన్-సి ఉండే ఆహారాలతో కలిపి తినండి.

గుమ్మడికాయ గింజల్లో ఐరన్ అధికం. వీటిని సలాడ్లు, ఓట్ మీల్స్ లేదా పెరుగుపై చల్లుకుని తినవచ్చు.

బీట్‌రూట్, క్యారెట్ వంటి దుంపలు ఐరన్‌కు గొప్ప మూలం. వీటిని పచ్చిగా లేదా సలాడ్లు, జ్యూస్, సూప్‌లలో వేసుకోండి.

కాయధాన్యాల్లోని ఇనుమును శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్-సి ఉండే పదార్థాలతో కలిపి తినండి.

డార్క్ చాక్లెట్ ఐరన్ స్థాయిలను పెంచుతుంది. కనీసం 70% కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ ఎంచుకోండి.