బరువు తగ్గడానికి  ఈ ఒక్క పండు తింటే చాలు..

అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కారణంగా మన పేగుల పనితీరు మెరుగుపడుతుంది. 

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆ పొటాషియం కారణంగా రక్త పోటు అదుపులో ఉంటుంది. 

 అరటి పండులో ఉండే ట్రైఫ్టోఫాన్ అనే అమినోయాసిడ్ కారణంగా మన శరీరంలో సెరోటనిన్ ఉత్పత్తి జరుగుతుంది.

ఈ సెరోటనిన్ కారణంగా మనకు ఒత్తిడి నుంచి  రిలీఫ్ దొరుకుతుంది.

అరటిపండులో మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. వీటి కారణంగా ఎముకలు  దృఢంగా తయారు అవుతాయి.

అరటి పండులో సీ విటమిన్ ఉంటుంది. సీ విటమిన్ కారణంగా కొల్లాజిన్  ఉత్పత్తి జరుగుతుంది.

అరటిపండ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి,  కాబట్టి  బరువు తగ్గడానికి సహాయపడుతుంది.