హార్ట్ ఎటాక్ ముందు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..
ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ గుండె సమస్యలు సాధారమయ్యాయి.
ఏ వయసులోనైనా హార్ట్ అటాక్ రావొచ్చు. కొలెస్ట్రాల్ పెరగొచ్చు, బీపీ అదుపు తప్పొచ్చు. వీటికి కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలి అని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు వచ్చే ముందు ముఖంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి.
పురుషుల ముఖం అలసి పోయినట్లు.. శారీరక శ్రమ అధికమైనట్లు కనిపిస్తుంది.
ముఖానికి చెమట పడుతుంది. అకస్మాత్తుగా వచ్చే చెమట.. గుండెపోటుకు సంకేతంగా చెప్పవచ్చు.
పసుపు లేదా బూడిద రంగు రంగుతో ముఖం పాలిపోయినట్లుగా ఉండవచ్చు.
కొంతమంది పురుషులు కళ్ల చుట్టూ లేదా పెదవుల చుట్టూ వాపు గమనించ వచ్చు. ఇది గుండె సమస్యను సూచిస్తుంది.
పురుషులతో పోలిస్తే మహిళలు భిన్నమైన ముఖ లక్షణాలను కలిగి ఉంటారు. వారు మెడ లేదా భుజాల నుంచి దవడ వరకు నొప్పిని సూచిస్తుంది.
మహిళలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మలబద్ధకం. తలనొప్పి వంటి సంకేతాలు సైతం గుండెపోటు లక్షణాలుగా చెప్పవచ్చు.
ఇవే కాకుండా వీపు, మెడ, దవడ, కడుపులో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు, ముఖం, కాళ్ళు వాపు, తల తిరగడం వంటి లక్షణాలు కూడా గుండెపోటు ముందు కనిపించే లక్షణాలుగా చెప్ప వచ్చు.