చికెన్, మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ ఎ, బి12, ఫోలేట్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత, కంటి సమస్యలతో బాధపడేవారు.. రోగ నిరోధక శక్తి లేని వారు లివర్ తినడం మంచిదని చెబుతున్నారు.
వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ B12తోపాటు మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని.. నరాల పని తీరు బాగుంటుందని అంటున్నారు.
తగిన మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాలి. మోతాదు మించితే హానికరం.
రోజుకు 100 గ్రాముల లివర్ తింటే డైలీ లిమిట్‌కు 10 రెట్ల విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో శరీరంలో విటమిన్ ఎ టాక్సిసిటీకి దారి తీసే ప్రమాదం ఉంది.
వీటిని ప్రతి రోజు తీసుకుంటే.. తలనొప్పి, ఐ ఫోకస్ దెబ్బతినడంతోపాటు కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి పడే అవకాశముంది.
వీటిని తీసుకునే క్రమంలో గర్భిణులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలి. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై విటమిన్ ఎ ప్రభావం చూపొచ్చు. ఆరు మాసాలలోపు శిశువులకు లివర్ పెట్టవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లివర్ టాక్సిన్ క్లీన్ చేసే అవయవం కావడం వల్ల... మటన్, చికెన్ లివర్‌లో హెవీ మెటల్ కంటామినేషన్ ఉండే ప్రమాదమూ ఉంది. కాడ్మియం, లెడ్ వంటివి కిడ్నీ, ఎముకల పని తీరును దెబ్బతీయ వచ్చని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
విటమిన్ ఎ సప్లిమెంట్స్, క్యాప్సూల్స్ తీసుకునే వారు లివర్ తినకూడదని సూచిస్తున్నారు. అంటే వారానికి ఒక సారి 50 నుంచి 75 గ్రాముల లివర్ తింటే సురక్షితం.
అయితే గర్భిణులు, చిన్నపిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునే వారు తప్పని సరిగా వైద్యుల సలహా తీసుకుని తినాలి.
మితంగా తీసుకుంటే చికెన్ లేదా మటన్ లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ హద్దు మించితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.