మధుమేహానికి  చెక్ పెట్టే సూపర్ జ్యూస్.. 

మారుతున్న జీవనశైలి కారణంగా, చాలా మంది ఈ రోజుల్లో డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యతో బాధపడేవారు చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. 

అయితే, డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ రసం తాగితే ప్రయోజనం ఉంటుంది.

కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుందని నిపుణులు అంటున్నారు.

 కాకరకాయలో పొటాషియం, ఐరన్, జింక్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు ఉంటాయి. 

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా మంచిదని భావిస్తారు.

డయాబెటిస్ రోగులు తాజా కాకరకాయ రసం తాగాలని నిపుణులు అంటున్నారు.