ఉల్లిపాయ టీ లాభాలు.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్…
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ, టీలు అతిగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టీ, కాఫీలకు బదులుగా ఉదయాన్నే ఉల్లిపాయతో తయారు చేసిన టీ తాగటం ఉత్తమం అంటున్నారు
ఉల్లిపాయల టీ సహజసిద్ధమైన ఎక్స్ పెక్టోరెంట్ గా పనిచేస్తుంది. ఇది గొంతు, ఊపిరితిత్తులలో ఉండే కఫాన్ని తొలగిస్తుంది.
ఉల్లిపాయల టీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది.
ఉల్లిపాయ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది నిద్రలేమి, అధిక రక్తపోటు, క్యాన్సర్, చక్కెర స్థాయి, రక్తహీనత, కడుపు సంబంధిత వ్యాధి, బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
కావలసిన పదార్దాలు: తరిగిన ఉల్లిపాయ: 1, లవంగాలు, వెల్లుల్లి మొగ్గలు: 2 లేదా 3, తేనె: 1 టేబుల్ స్పూన్, నీళ్లు: 1 లేదా 2 కప్పులు, బే ఆకు లేదా దాల్చిన చెక్క: 1 లేదా 2
ముందుగా స్టవ్‌పై పాన్ ఉంచి అందులో నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత మరిగిన నీటిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, లవంగాలు, బే ఆకులను వేసి మరిగించాలి.
నీటి రంగు మారిన తర్వాత.. ఒక కప్పులో ఒడ కట్టాలి. రుచికి సరిపడా తేనె, దాల్చిన చెక్క పొడిని కలుపుకుంటే ఉల్లిపాయ టీ రెడీ!