చెర్రీ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
చెర్రీ పండ్లను స్వీట్లు లేదా కేకులపై పెట్టి ఇస్తుంటారు. కేవలం ఆ సమయంలో మాత్రమే ఈ పండ్లను తింటుంటారు.
చెర్రీ పండ్లలో మన శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో చెర్రీస్ తీసుకుంటే.. ఇది శిశువు అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
ఈ పండ్లను తింటే ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
చెర్రీ పండ్లలో గుండెకు ఎంతగానో మేలు చేసే అనేక సమ్మేళనాలు ఉంటాయి.
చెర్రీస్‌లోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తుంది.