హై బీపీని కంట్రోల్ చేసే..  ఈ యాపిల్ గురించి తెలుసా?

రోజ్ యాపిల్ లేదా వాటర్ యాపిల్.. వీటిని తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతారు.

ఇది జామకాయల జాతికి చెందిన స్పెషల్ ఫ్రూట్. రుచిలో సైతం అంతే మధురంగా ఉంటుంది.

గుండెకు మంచిదని అంటారు. ఈ పండులో గుండెకు కావాల్సిన పోషకాలు.. వీటిలో పుష్కలంగా ఉంటాయని పేర్కొంటారు.

వీటిలోని పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ నియంత్రించి.. మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి.

తరచూ రోజ్ యాపిల్ తినడం వల్ల గుండె పోటు, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరవు. 

ఇందులో విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను సైతం మెరుగు పరుస్తుంది. 

మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

రోజ్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉండేందుకు దోహదపడుతుంది.

ఈ రోజు యాపిల్‌లో కెలోరీలు తక్కువగా.. ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో విటమిన్లు ఏ,బీ సైతం ఉంటాయి.

ఈ పండులోని ఫ్లెవనాయిడ్లు.. క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.

రోజ్ యాపిల్‌లో జాంబోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలను చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇక ఈ పండులోని గుణాలు గ్లూకోజ్ వినియోగాన్ని సైతం క్రమబద్ధీకరిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిలో పోటాషియం అధికంగా ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంచుతుంది.