పాలీష్‌ రైస్ తింటున్నారు.. మీకు ఆ వ్యాధి వచ్చినట్టే

చాలా మంది బాగా పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తింటుంటారు

పాలిష్ చేసిన బియ్యాన్ని తిరిగి చాలా సార్లు కడగడం వల్ల రైస్‌లోని థయామిన్ పోతుంది

విటమిన్ బీ1 లోపించడంతో బెరిబెరి వ్యాధి వచ్చే అవకాశం ఉంది

బెరిబెరి గుండెను, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది

తడి బెరిబెరి, పొడి బెరిబెరి అని రెండు రకాలు ఉండగా.. తడి బెరిబెరి గుండె ఆగిపోడానికి కూడా కారణమవుతుంది

పొడి బెరిబెరి నరాలను, కండరాలను దెబ్బతీస్తుంది

చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు, నడకలో ఇబ్బంది, మానసిక గందరగోళం, మాటలు తడబడటం పొడి బెరిబెరి లక్షణాలు

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఈ వ్యాధి వస్తుంది

ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకునే వారిలో కూడా ఈ వ్యాధి వస్తుంది

మొత్తం పాలిష్ బియ్యం కాకుండా.. బియ్యంలో థయామిన్ ఉండేలా చూసుకోవాలి.. దంపుడు బియ్యం చాలా బెటర్