బీపీని ఎప్పుడూ కంట్రోల్‌లో  ఉంచుకోవాలి.

రక్తపోటు పెరిగితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

వేడి నీటితో స్నానం మీ కండరాలకు తగినంత విశ్రాంతినిస్తుంది.

మీ రక్తనాళాలను వ్యాకోచింప చేస్తుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది.

సులభమైన బ్రీతింగ్ వ్యాయామాలు మీలోని స్ట్రెస్‌ను, అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ప్రశాంతతను అందిస్తాయి.

బీపీకి స్మోకింగ్ ప్రధాన శత్రువు. పోగాకులోని నికోటిన్ వల్ల బీపీని పెంచే రసాయనాలు విడుదలవుతాయి.

మీ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలంటే ముందుగా మీరు మీ బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలి. శరీరంలో సోడియం స్థాయులు పెరిగిన కొద్దీ బీపీ పెరిగిపోతుంది.