మిల్క్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలు, బియ్యం శరీరానికి త్వరిత శక్తినిస్తాయి. పాలు, బియ్యం సులభంగా జీర్ణమవుతుంది. పాల అన్నంలోని కార్బోహైడ్రేట్లు శక్తి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ ప్రయోజనాలు లభిస్తాయి.
మిల్క్ రైస్.. సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాల అన్నం తీసుకోవచ్చు.
పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలకు బలానిస్తాయి.
పాలన్నం తినడం వలన జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. అధిక సమయంపాటు కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహద పడుతుంది.
బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పాలతో కలిపి తీసుకుంటే.. అవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. పాలు, రైస్ కలిపి ఆహారంగా తీసుకుంటే.. తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది.