కీటో డైట్‌లో కొవ్వులు  ఎక్కువగా ఉంటాయి. 

ప్రోటీన్లు మితంగా ఉండి కార్బో‌హైడ్రేట్లు చాలా స్వల్పంగా ఉంటాయి.

మందుల వల్ల నయం కాని మూర్ఛ వ్యాధికి చికిత్సగా 1920వ దశకంలో కీటో డైట్‌ను అభివృద్ధి చేశారు.

కీటో డైట్‌ పాటించే వారి శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకోవడం మొదలుపెడుతుంది.

కీటో డైట్ పాటించే వారు చాలా త్వరగా బరువు తగ్గుతారు. అయితే ఈ డైట్‌ను దీర్ఘకాలం పాటించడం చాలా కష్టం.

కీటో డైట్‌లో ఉన్న వారు మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది

కీటో డైట్ ప్రారంభించిన తర్వాత కొందరిలో తలనొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి.

శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది.