షుగర్ వ్యాధిగ్రస్తులకు..
ఈ పళ్లు మంచివి కావు
చక్కెర వ్యాధిగ్రస్తులు కొన్ని పళ్లకు దూరంగా ఉండాలి. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ ఫైబర్ ఉన్న పళ్లు వారికి కీడు చేస్తాయి.
మామిడి పళ్లలో ఎక్కువ మోతాదులో సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వీటి జోలికి వెళ్లకూడదు
వేసవిలో దొరికే పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఎండు ద్రాక్షకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండడం మంచిది.
పైనాపిల్‌లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
బాగా పండిన అరటి పండు కూడా హెచ్చు మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది.
చెర్రీ పళ్లలో కూడా షుగర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.
ద్రాక్ష పళ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. వీటిని చాలా తక్కువ మోతాదులో తినాలి.
ఆపిల్, బత్తాయి, నారింజ, పీర్స్, కివీ, బెర్రీస్ మొదలైన వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు.
Related Web Stories
ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.. వీటిని తింటే మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట!
ఎట్టి పరిస్థితిలో కుక్కర్లో ఈ ఆహారం వండవద్దు.. వండితే ఇక ఆసుపత్రి పాలే..
శరీరంలో ఈ భాగాలను ఎక్కువగా శుభ్రం చేస్తున్నారా.. జాగ్రత్త
ఈ పండ్లు తింటే ఆరోగ్యవంతమైన జుట్టు మీ కోసం