మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చర్మంతోపాటు కంటికి సంబంధించిన అలెర్జీలు వస్తాయని అంటున్నారు.
పిల్లలు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు వీటిని తినకూడదని పేర్కొంటున్నారు.
బంగాళాదుంప తినడానికి చేదుగా ఉన్నా.. వాటిని ఆహారానికి వినియోగించకుండా ఉండడం ఉత్తమమని వివరిస్తున్నారు.
మొలకెత్తిన లేకుంటే ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు వంటకు వాడకుండా ఉండటమే మంచిది.
మొలకెత్తిన బంగాళాదుంపలలో పోషక విలువలు తగ్గిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా.. వీటిలో గ్లైకో
అల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలు తయారవుతాయట. ఇవి ఫుడ్ పాయిజన్ దోహదం చేస్తాయి.
ఇక మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్ అనే విష రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి ప్రమాదకరమైనది.
మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులతోపాటు జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో తలనొప్పి, మైకం వంటి సమస్యలు వస్తాయి.