బాదంలో శరీరానికి అవసరమైన  అనేక పోషకాలు ఉంటాయి

వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.

జీర్ణం, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, బరువు నియంత్రణ, నిద్ర సమస్యలు వంటి వాటికి బాదం ఎంతో సహాయపడుతుంది.

పరగడుపున తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది.

రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

బాదంలో విటమిన్ E, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల ఎదుగుదలకు సహాయపడతాయి.

విద్యార్థులు తరచుగా దీన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బాదంలో ఉండే మెగ్నీషియం అనే ఖనిజం నరాలను ప్రశాంతంగా ఉంచి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.