స్వీట్లు తిన్న తర్వాత వాటర్  తాగితున్నారా..

స్వీట్స్ అంటే అందరికి ఇష్టమే. దాదాపు ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో స్వీట్స్ తింటారు.

మనలో చాలా మంది స్వీట్స్ తిన్న వెంటనే నీళ్ళు తాగుతారు. ఇలా ప్రతి ఒక్కరికి ఉండే అలవాటే.

ఇలా స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

స్వీట్లు తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం త్వరగా పెరుగుతుందని.. దీనినే షుగర్ స్పైక్ అంటారని చెబుతున్నారు. 

ఇది రక్తంలో చక్కెర సమస్యతో బాధపడే వారికే ఇది మంచిదంటున్నారు. స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగితే చక్కెర స్పైక్ సమస్య మరింత అధికమవుతుంది.

ఏ రకమైన ఆహారం అయినా సులభంగా జీర్ణం కావడానికి నీరు సహాయపడుతుంది.

తీపి పదార్థాలు సరిగ్గా జీర్ణం కావడానికి వాటిని తినడానికి ముందు లేదా తర్వాత నీరు త్రాగడం ముఖ్యం. స్వీట్లు తిన్న తర్వాత దంతాల్లో బ్యాక్టీరియా మరింత చురుగ్గా మారుతుంది. అందుకే స్వీట్లు తిన్న కొద్ది సేపటి తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆ బ్యాక్టీరియా తొలగిపోతుంది.

కేవలం స్వీట్లు తిన్నప్పుడే కాదు.. ఏదైనా ఆహారం తిన్న ఆరగంట, గంట తర్వాత క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా ముఖ్యం. అప్పుడే దంతాల ఆరోగ్యంగా ఉంటాయి.