నిమ్మరసం కిడ్నీలకు మంచిదేనా? ఇంకెన్ని ఉపయోగాలంటే.. 

నిమ్మలోని యాసిడ్ ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ కడుపులో యాసిడ్ శాతం తగ్గుతుంది. నిమ్మరసం తీసుకుంటే ఆ లోటు భర్తీ అవుతుంది.

ఉదయాన్నే నిమ్మ రసం తాగితే రోజంతా మీరు హైడ్రేట్‌గా ఉంటారు. అవసరమైన యాసిడ్ కడుపులోకి చేరుతుంది.

నిమ్మరసం క్యాలరీలను కరిగిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

నిమ్మకాయల్లో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణం నుంచి శరీరాన్ని కాపాడి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

నిమ్మకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి మన శరీర కణాలను రక్షిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 

మన శరీరానికి అవసరమైన పొటాషియమ్ నిమ్మరసం నుంచి లభిస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.