వంకాయ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తాజా నీలం వంకాయ ముక్కల్లో నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వడకట్టిన రసంలో నిమ్మరసం, తేనె, ఉప్పు వేసి తీసుకోవాలి.

వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు.. శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

వంకాయలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి.

బరువును అదుపులో ఉంచడంలో కూడా వంకాయ రసం బాగా పని చేస్తుంది.

జీర్ణక్రియను సులభతరం చేసి, మలబద్ధక సమస్యను నివారిస్తుంది.

వంకాయలోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వంకాయ రసంలోని ఫైటోకెమికల్స్ కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.