యాపిల్ ని ఉడకబెట్టుకుని తినడం వల్ల లాభాలు తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అంతే..   

రోజుకో యాపిల్ తినడం మంచిదే. కానీ..తినే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మరింత ఎక్కువ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

 యాపిల్ ని నేరుగా కాకుండా ఉడకబెట్టుకుని తింటే చాలా సులువుగా జీర్ణమవుతుంది.

సింపుల్ గా ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో యాపిల్ వేసి ఉడకబెట్టాలి.

 పైన పొట్టు తీసి యాపిల్ ని ముక్కలుగా చేసుకుని ఉదయాన్నే తినాలి.

 పరిగడుపున ఇలా ఉడకబెట్టిన యాపిల్ తింటే గట్ హెల్త్ చాలా బాగుంటుంది.

యాపిల్  మెత్తగా ఉడకడం వల్ల తినగానే సులువుగా జీర్ణమవుతుంది.

ఇది పెక్టిన్ అనే ఓ ఫైబర్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆహారం జీర్ణం అవడంలో తోడ్పడుతుంది.

యాపిల్ ని ఉడకబెట్టే సమయంలో లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ యాపిల్ కి బాగా పడుతుంది.

యాపిల్ ఉడకబెట్టిన నీళ్లను పారబోసే బదులుగా వాటిని టీ లాగా తాగేయొచ్చు.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.