జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే  సరైన పోషకాహారమే కీలకం.

విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారం వల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి

ఒమేగా 3, బయోటిన్, ఐరన్ లాంటి పోషకాలతో నిండి ఉండే ఆహారాలు జుట్టుకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఓట్స్, క్వినోవా వంటి పూర్తి ధాన్యాలలో విటమిన్ బి సమూహం, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి.

జుట్టుకు బలాన్ని ఇస్తాయి జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ప్రతి రోజు హోల్ గ్రెయిన్స్‌ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి.

జుట్టు నష్టాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన జుట్టును కలిగిస్తాయి. బెర్రీస్ తినడం వల్ల జుట్టు పాడైపోవడం, చిట్లిపోవడం సమస్యలు తగ్గుతాయి.

క్యారెట్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు తేమ వస్తుంది. క్యారెట్ తినడం వలన జుట్టు మెరుస్తుంది. దృఢత్వం పెరుగుతుంది.