వర్షంలో ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ అంతా తడుస్తూనే ఉంటాం. మరి వర్షపు నీరు తాగడం మంచిదేనా? ఈ నీటిని తాగడం వల్ల లాభాలున్నాయా? నష్టాలున్నాయా అంటే..
వర్షం నీరు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. ఈ నీరు చాలా స్వచ్చమైనదని చెబుతారు. కానీ ఈ వర్షపు నీరు తాగకూడదని పెద్దలు చెబుతారు.
ఈ నీరు స్వచ్ఛమైనదే అయినప్పటికీ ఎందుకు తాగకూడదు అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది.
భూమిపై నీరు ఆవిరి రూపంలో ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారతాయి.
అయితే మంచి నీరు సురక్షితమైంది. కానీ వర్షపు నీరు మేఘాలు, కణాల రూపంలో నీటిని స్వీకరిస్తుంది.
ఆ సమయంలో అది నీటితో పాటు అనేక మలినాలను సైతం తీసుకెళ్తుంది. మరి ముఖ్యంగా దుమ్ము, మట్టి, SO₂-NOx వంటి వాయువులను మోసుకెళ్లి.. తిరిగి వర్షం రూపంలో ఇస్తుంది.
ఈ కారణంగా వర్షం నీరు.. తాగడానికి పనికి రావని పెద్దలు చెబుతున్నారు. వర్షపు నీటిలో మలినాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌కు కారణమవుతాయి.
ముఖ్యంగా మొదటి సారి కురిసే వర్షంలో తడవడం, ఆ నీటిని తాగడం మంచిది కాదని చెబుతున్నారు.
ఎందుకంటే? మొదటి సారి కురిసే వర్షపు నీటిలో.. వాతావరణం నుండి వచ్చే ధూళి ,కాలుష్య కణాలను అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే తొలిసారి కురిసే వర్షంలో తడవకూడదని పెద్దలు చెబుతారు.