రాత్రివేళ తరచూ నీరు  తాగాలనిపిస్తే అది సాధారణం కాదు.

దీన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు.

మీ శరీరంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

 రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చక్కెరను బయటకు పంపడానికి శరీరం తరచూ మూత్ర విసర్జన చేస్తుంది.

కిడ్నీలు శరీరంలోని విష పదార్థాలను, ఎక్కువ నీటిని బయటకు పంపడంలో చాలా ముఖ్యమైన పని చేస్తాయి.

సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల రాత్రిపూట తరచుగా మూత్రం వస్తుంది.

స్లీప్ అప్నియా ఉన్న వారికి నిద్రలో శ్వాస మధ్యలో ఆగిపోతూ ఉంటుంది.

 ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో నిద్రలో మేల్కొని నీళ్లు తాగాల్సిన అవసరం వస్తుంది.