సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్, చక్కెర కలిపిన టీ, కాఫీలు తాగితే ఇన్సులిన్ నిరోధకత, వాపుతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే ప్రాసెస్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే వాపు, ఆక్సిడేషన్ వల్ల కాలేయం దెబ్బతింటుంది.
అధికమొత్తంలో మద్యం సేవించడం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. కొవ్వు పేరుకుపోతుంది.
శారీరక శ్రమ లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
తగినంత నిద్రలేకపోవడం, నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వల్ల గ్లూకోజ్, లిపిడ్ జీవక్రియలను నియంత్రించే హార్మోన్లు దెబ్బతిని కాలేయంలో కొవ్వు ఏర్పడుతుంది.