మల్లెపూలతో ఇన్ని లాభాలా..  తెలిస్తే అస్సలు వదలరు..

మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు  ఆరోగ్య నిపుణులు.

మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి.

మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. 

ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. 

 కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. 

మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది.