హృద్రోగులు పచ్చి ఉల్లిపాయ తినడం మంచిదేనా?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గుండె సమస్యలు కామన్ అయిపోయాయి.

ఏ వయసులోనైనా హార్ట్‌ అటాక్ రావొచ్చు. కొలెస్ట్రాల్ పెరగొచ్చు, బీపీ అదుపు తప్పొచ్చు. వీటికి కారణం  ఆహారపు అలవాట్లు, జీవన శైలి అని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి పచ్చి ఉల్లిపాయలు గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్‌ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి.

గుండె సమస్యలు ఉన్నవారు అలాగే చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.