ఈ సమస్యలకు ఒక్కటే మందు..  కాల్చిన మొక్కజొన్న పొత్తు

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వ్యాధులను నివారిస్తుంది. 

మొక్కజొన్నలో కేలరీలు స్వల్పంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది.

వీటిలో విటమిన్ ఎ, బి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక సమస్య వస్తుంది. ఇవి ఈ సమస్యను దూరం చేస్తుంది. 

వర్షపు నీటిలో యాసిడ్ నేచర్ ఉంటుంది. దీని వల్ల వర్షంలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి చర్మ వ్యాధులను నివారిస్తుంది.

వర్షంలో తడవడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉండటం వల్ల వానాకాలంలో జుట్టు అధికంగా రాలుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మొక్కజొన్న గింజల్లో ఫైబర్ కారణంగా.. గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది.

మొక్కజొన్నలో కాపర్, ఐరన్‌తోపాటు మరిన్ని ఖనిజాలుంటాయి. ఇవి ఎముకల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. మొక్కజొన్నలోని పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని సైతం కాపాడతాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా.. నివారించడంలో దోహదపడతాయి. రక్తహీనతతో బాధపడే వారు మొక్కజొన్న గింజలు తినడం మంచిది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.