200 ఏళ్లు బతకొచ్చు..   బాబా రాందేవ్ కామెంట్స్ వైరల్!

మనిషి ఆయువు వందేళ్లు అని అంటుంటారు. అయితే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మాత్రం అంతకంటే ఎక్కువ కాలమే బతకొచ్చునని చెబుతున్నారు.

దాదాపు 150 నుంచి 200 ఏళ్ల వరకు మనుషులు బతకొచ్చని రాందేవ్ అన్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలో మెదడు, గుండె, కళ్లు, కాలేయం మీద ఎక్కువ ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు.

100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లలో తింటున్నామని బాబా రాందేవ్ పేర్కొన్నారు.

ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి అవసరమని సూచించారు.

మానవ శరీరంలో ప్రతీ కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని రాందేవ్ చెప్పుకొచ్చారు.

150 నుంచి 200 సంవత్సరాలు వరకు బతకొచ్చు అంటూ బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.